కళాశాల రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలి-కేంద్ర పౌర విమాన శాఖామాత్యులువేడుకగా శ్రీ వృక్ష విద్యాసంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం.
మధురవాడ,జయ జయహే న్యూస్: కళాశాల రోజులలో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి తమ అభివృద్ధికి,నూతన ఆవిష్కరణలకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమాన శాఖా మంత్రి కింజారాపు రామ్మోహన నాయుడు అన్నారు. శనివారం కార్ షెడ్ కూడలి, అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీ వృక్ష విద్యాసంస్థల నూతన ప్రాంగణం (జూనియర్ ఇంటర్ కళాశాల) ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు,రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా...