సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డ్స్ 60 ఏళ్లు దాటిన వృద్ధులు అందరికీ వర్తింపు సచివాలయాల్లో దరఖాస్తులు

జయజయహే : రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయాల్లో ఆప్షన్ ఓపెన్ అయ్యిందని సిబ్బంది తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రాయితీ సహా ఇతర సదుపాయాలను ఈ కార్డు ద్వారా పొందవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు....