దేశీయ విత్తన సంపత్తిని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలి- జలబీరాద్రి సంస్థ జాతీయ కన్వీనర్ – రావి మాను పాకల గ్రామంలో చెక్ డ్యాం ప్రారంభం – జలవనరులు సద్వినియోగం చేసుకోవాలి – దేశీయ విత్తనాలను కాపాడుకోవాలి – బొలిశెట్టి సత్యన్నారాయణ, జాతీయ కన్వీనర్, జలబీరాద్రి

అల్లూరి జిల్లా : జయజయహే : దేశీయ విత్తన సంపత్తిని వారసత్వ సంపదగా తీర్చిదిద్దు కోవాలని జలబీరాద్రి సంస్థ జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యన్నారాయణ కోరారు. శనివారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగి పంచాయతీ రావి మాను పాకల గ్రామంలో సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశి ప్రభ నేతృత్వంలో నిర్మించిన చెక్ డ్యాంను ప్రారంభించిన అనంతరం సర్పంచ్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జలవనరులు సద్వినియోగం చేసుకోవాలి, దేశీయ విత్తనాలను కాపాడుకోవాలి అని కోరారు. ఈ...