ధరిత్రి దినోత్సవం జయప్రదం చేయండి. సమస్త జీవరాశి జీవించడానికి కృషి చేయండి డాక్టర్ డివిజి శంకర్రావు, చైర్మన్, ఎపి స్టేట్ ఎస్ టి కమిషన్
ఎం వి పి కాలనీ : జయజయహే : ధరిత్రి దినోత్సవం జయప్రదం చేయండి అని ఎపి స్టేట్ ఎస్ టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు కోరారు. మంగళవారం ఉదయం ఆయన ఎంవిపి కాలనీలో విలేకరులతో మాట్లాడారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా తాను సైతం పక్షులు, వన్యప్రాణులు కోసం నీరు మట్టి పాత్రలలో అందుబాటులో ఉంచానని, పిచ్చుకల కోసం గూళ్ళు, ధాన్యం కంకుల కుచ్చులు ఏర్పాటు చేసామని తెలిపారు. సమస్త జీవరాశి జీవించడానికి కృషి చేయండని పిలుపునిచ్చారు. మనిషి జీవులు గూడు...