SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 10:37 am Posted by : SHIVASURYA NEWS

రియల్ టైం రాపిడ్ రెస్పాన్స్( ఆర్ ఆర్ ఆర్ )ఇన్స్టలేషన్ మొదలుపెట్టిన ఆర్ ఆర్ ఆర్

ఉండి: జయ జయహే: ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 74 గ్రామాల్లో 950 సి సి కెమెరాలు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ తో ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పి4 కార్యక్రమంలో భాగంగా 3 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ప్రప్రథమంగా రియలటైం రాపిడ్ రెస్పాన్స్( ఆర్ ఆర్ ఆర్) ఇన్స్టలేషన్ మొదలైంది. జూన్ నెలాఖరుకి పూర్తి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కోటి 10 లక్షలు విరాళాలు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పేర కలెక్టర్ నాగరాణి కు దాతలు అందచేసారు. ఈ కార్యక్రమంలో ఐజి అశోక్ కుమార్ , జిల్లా ఎస్పి అద్నాన్ అస్మి , జిల్లా ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.