Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీఅగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కారానికి కై పల్లాకి వినతి.

అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కారానికి కై పల్లాకి వినతి.

విశాఖపట్నం :జయజయహే : గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కలిసి అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూపు పెట్టాలని ఒకేషనల్ కోర్సుకి అధ్యాపకులని ,పర్మినెంట్ ప్రిన్సిపాల్ ని యమించాలని, కాలేజీకి సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేయాలని, ఫార్మాసిటీ ఉద్యోగులకు వివిధ రాష్ట్రాల నుండి హోమి బాబా క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చే రోగులకు సౌకర్యార్థం మెట్రో ట్రైన్ ని కూర్మన్నపాలెం నుండి లంకెలపాలెం వరకు పొడిగించాలని వినతి పత్రము అందజేయడం జరిగినది. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అగనంపూడి ఏరియా స్థానిక పెద్దలు పోరాట ఫలితంగా అగనంపూడి జూనియర్ కాలేజీ రావడం జరిగిందని కాలేజీ అధ్యాపకులు ఉత్తమ బోధన్ తో నేడు విశాఖ జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని కాలేజీలో అధ్యాపకులు నియమకం, బైపీసీ గ్రూపు, పర్మినెంట్ ప్రిన్సిపాల్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటాను అన్నారు. కాలేజీలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యెజన సోలార్ పథకంతో సి ఎస్ ఆర్ నిధులతో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేస్తానని, మెట్రో ట్రైన్ ప్రస్తుతం సిటీ నుండి కూర్మన్నపాలెం వరకు ప్రతిపాదన చేయడం జరిగిందని రెండో విడతలో లంకెలపాలెం వరకు పొడిగించడానికి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. జీవీఎంసీ 85 వ వార్డు టిడిపి ఇన్చార్జ్ గంతకోరు అప్పారావు 79 వ వార్డు టిడిపి సీనియర్ నాయకులు గొల్లవిల్లి వెంకటరావు తెలుగు యువత నాయకులు బండారు చందు రమేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?