SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 8:05 am Posted by : SHIVASURYA NEWS

పోలమాంబ అమ్మవారి భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్

విశాఖపట్నం :జయజయహే : శ్రీ శ్రీ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం లో భాగంగా ఎం వి ప్రణవ్ గోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదం భారీ ఎత్తున పంపిణీ చేశారు. ఆలయం సమీపంలో మంగళవారం ఉదయం ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు , వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ , టీడీపీ యువ నాయకుడు వెలగపూడి ప్రతాప్ రుద్ర తదితరులు ప్రారంభించారు. పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులకు చక్రపొంగలి, పులిహోర వంటివి అందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 8వేల మందికి పైగా భక్తులకు ఈ ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకు పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇరువురు ఆకాంక్షించారు. ఎం వి ప్రణవ్ గోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు వినయ్, రతన్ కాంత్, విజయ్ కుమార్, హరీష్ కుమార్, అభి, ప్రదీప్, సంతోష్, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.