ప్రేమ పేరుతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు మహిళా రక్షణకు కలిసికట్టుగా” అనే కార్యక్రమ ప్రారంభంలో యువతకు హోం మంత్రి అనిత హితవు
ఫోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని యువతకు సూచన, స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్టుగా పెట్టేందుకు యోచన విశాఖపట్టణం,జయజయహే : తెలిసీ తెలియని వయసులో ప్రేమ ఉచ్చులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోరాదని, లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని రాష్ట్ర హోం మంత్రి హితవు పలికారు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలుపాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పోక్సో కేసుల్లో 60 శాతం మంది 18-20 ఏళ్ల లోపు వారే ఉండటం శోచనీయమని...