SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 12:21 pm Posted by : SHIVASURYA NEWS

ప్రధానమంత్రి అప్రెంటిస్ షిప్ మేళాకు 91 మంది హాజరు

విజయనగరం: జయజయహే : జిల్లాలోని ఉన్న ప్రభుత్వ ఐ.టి.ఐ, వి.టి.అగ్రహారం, విజయనగరం లో ఈ నెల 15 వ తేదీ మంగళవారం ఉదయం 09:00 నుండి 27వ ప్రధాని మంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా (పి ఎమ్ ఎన్ ఎమ్ ) ను నిర్వహిoచినట్లు ప్రభుత్వ ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అప్రెంటిస్ అడ్వైజర్ పేర్కొన్నారు. ఐ.టి.ఐ పాసైనా వారు సుమారు 91 మంది ఈ అప్రెంటిస్ షిప్ మేళా లో పాల్గొన్నారు. మైలాన్ లాబరేటరీస్ నుండి హరి కృష్ణ, డి.జిమ్ మరియు హేమ కిరణ్, హెచ్.ఆర్ మేనేజర్ , జయ భేరి ఆటోమోటివ్ లిమిటెడ్, విశాఖపట్నం నుండి నాగరాజు, హెచ్.ఆర్ మేనేజర్, శ్యాంసంగ్ అధరైజెడ్ సర్విస్ సెంటర్,విజయనగరం నుండి నందు, హెచ్.బి.ల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, కందివలస నుండి టి. రామకృష్ణ, హెచ్. ఆర్ మేనేజర్,టైచి కాస్ట్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, సూళ్లూరుపేట నుండి కే. గిరీశం, హెచ్. ఆర్ మేనేజర్,విజయనగర్ బయోటెక్ లిమిటెడ్, నాతవలస నుండి బి. చంద్రశేఖర్, హెచ్. ఆర్ మేనేజర్, క్యూసివ్ టెక్నాలజీస్, హైదరాబాద్ నుండి జి. కమల్, హెచ్. ఆర్ మేనేజర్ మరియు జాన్ సన్ లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్,విశాఖపట్నం నుండి కే. అలేఖ్య కంపనీ ప్రతినిధులు పాల్గొన్నారు.మొత్తం 152 ఖాళీలు ప్రకటించారు. ఎప్రింటీస్ కొరకు ఎంపిక అయిన వారికి ఆయా పరిశ్రమలలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తగిన స్టయిఫండ్ చెల్లించనున్నట్లు జిల్లా కన్వీనర్ టి. వి. గిరి తెలియజేసారు. ఈ అప్రెంటిస్ షిప్ మేళా లో జి రామాచారి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.