SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 6:51 am Posted by : SHIVASURYA NEWS

లంకెలపాలెం గ్రామంలో పర్యటించిన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు

పెందుర్తి : జయజయహే : పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం జీవీఎంసీ 79 వ వార్డు లంకెలపాలెం గ్రామంలో పర్యటించి గ్రామంలో ప్రధానంగా ప్రతిరోజు వందలాది లారీల బొగ్గు మరియు ఫ్లైఎష్ లంకెలపాలెం జంక్షన్ గుండా ప్రయాణం చేయడం వలన విపరీతమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామంటూ లంకెలపాలెం ప్రజలు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకి దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం బొగ్గు మరియు ప్లేయర్స్ లారీలు లంకెలపాలెం జంక్షన్ గుండా ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించారు. అదేవిధంగా లంకెలపాలెం జంక్షన్ నుండి రైల్వే ట్రాక్ మీదుగా బ్రిడ్జి నిర్మించడం వలన లంకెలపాలెం పాత ఊరికి వెళ్లడానికి సుమారు కిలోమీటర్ ప్రయాణం చేయవలసి వస్తుంది కాబట్టి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలంటూ చాలాకాలం నుండి గ్రామస్తులు కోరుతున్నాడంతో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించడానికి అనువైన స్థలం కూడా పరిశీలించారు. అక్కడి నుండే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో ఫోన్లో మాట్లాడి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం లంకెలపాలెం జంక్షన్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కోటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. ముఖ్యంగా తాను నెలకు 21 రోజులు ప్రజల్లో ఉంటున్నానని, నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని ఇది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఎప్పటినుండో ప్రధాన సమస్యలుగా ఉన్న కాలుష్యం మరియు తాడి తరలింపు, పెదముసిడివాడ భూ ఆక్రమణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దుల్ల లక్ష్మి రామనాయుడు, గొన్న రమాదేవి, రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు,మండల పార్టీ అధ్యక్షుడు బొద్గపు శ్రీనివాస్ కాసులు, జిల్లా కార్యదర్శి బుగిడి గోవిందరావు, కరణం నర్సింగరావు, బలిరెడ్డి అప్పారావు, బలిరెడ్డి సత్యారావు,బోండా అప్పారావు మాస్టారు,, సుందరపు శ్రీనివాసరావు, సర్వసిద్ధి సన్యాసి రాజు, చలపతి రామారావు తదితరులు పాల్గొన్నారు.