Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీప్రజా దర్బార్ నిర్వహించిన శాసనసభ సభ్యులు పంచకర్ల

ప్రజా దర్బార్ నిర్వహించిన శాసనసభ సభ్యులు పంచకర్ల

పెందుర్తి : జయజయహే : సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం, సబ్బవరం మండలం, పెదగంట్యాడ మండలం మరియు జీవీఎంసీ జోన్ 8 మరియు జోన్ 6 పరిధిలో ఉన్న వార్డుల ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు మరియు ఫిర్యాదులను స్వీకరించడం జరిగినది ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 75 వినత పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి తొలితిగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగినది ప్రజల నుండి స్వీకరించిన వినత పత్రాల్లో ప్రధానంగా భూ ఆక్రమణలు, చెరువులు, గడ్డలకు సంబంధించిన ఫిర్యాదులు , పెన్షన్ మంజూరు కొరకు, త్రాగునీటి సమస్య కొరకు, రోడ్లు, డ్రైన్, కలవర్డ్స్ నిర్మాణాల కొరకు మరియు పార్కుల అభివృద్ధి గ్రామాలు మరియు వార్డులలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు కొరకు ఎక్కువ శాతం ఫిర్యాదులు అందినవి ఈ యొక్క సమస్యలన్నిటిని సత్వర పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?