అనుకున్నట్లే జరిగింది తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే దోస్తీ అన్నామలైను తప్పించడంతో రూట్ క్లియర్ సీఎం అభ్యర్థిగా పళని స్వామి

తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే పూర్తి స్థాయి ఎన్నికల వాతావరణ ఆ రాష్ట్రంలో ఏర్పడింది. అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏలో చేరింది. గత ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేశాయి. తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై దూకుడుగా వెళ్లడంతో అన్నాడీఎంకే దూరం అయింది. ఇప్పుడు మళ్లీ అన్నామలైను తప్పించి అన్నాడీఎంకేను ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది. చెన్నైలో హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పళనిస్వామితో చర్చల అనంతరం అమిత్...