మంగళగిరికి మహర్దశ 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలుపుతా మంత్రి నారా లోకేశ్ ఉద్ఘాటన
మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో మరో హామీకి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అంకురార్పణ చేశారు. మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకానిలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి నారా లోకేష్ ఆదివారం భూమి పూజ చేశారు. చిన్న కాకాని వద్ద 7.35 ఎకరాల్లో 52.20 కోట్ల వ్యయంతో ఆస్పత్రి నిర్మాణం జరుగనుంది. దేశంలోనే అత్యున్నత ఆస్పత్రిగా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి...