SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 6:37 am Posted by : SHIVASURYA NEWS

కితలంగి గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి

పాడేరు : జయజయహే : ల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని కితలంగి పంచాయతీ పరిధి గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం పాడేరు ఐటిడిఏలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశామని సర్పంచ్ ఒరబోయిన.సుబ్బారావు తెలిపారు.ఆ అవినతిలో భాగంగా పడాలపుట్టు కినంగుడ రంగ్సింగిగుడ పూలుగుడ గ్రామాల్లో పాఠశాల భవనాలు మంజూరు చేయాలని కోరామన్నారు.బిల్లాపుట్టు తదితర గ్రామాల్లో సిసిరోడ్లు దేవాలయాలు మంజూరు చేయాలని కోరమన్నారు.కలెక్టర్ స్పందించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సర్పంచ్ సుబ్బారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పంచాయతీ గిరిజనులు తదితరులు ఉన్నారు.