విశాఖలో 12 వేల ఐటీ ఉద్యోగాలు, టీసీఎస్ రాకతో బూస్టప్ రూ. 1370 కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నం : జయజయహే: ప్రఖ్యాత ఐటి దిగ్గజం టిసిఎస్ కు విశాఖలో 21.16 ఎకరాలను రూ. 99పైసలకు కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఎన్నికల హామీని నెరవేర్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి లోకేష్ గతఏడాది అక్టోబర్ లో ముంబయ్ లోని టిసిఎస్ హౌస్ ను సందర్శించి...