ప్రపంచ బాషల్లో సంపూర్ణ శ్రీమద్భగవద్గీత ఆడియో రూపొందించి అందించడమే లక్ష్యం ప్రతీ పౌరునికి ఒక జీవన పాఠ్య గ్రంధం కావాలి లోకార్పణ సభలో డా.గజల్ శ్రీనివాస్ .వెల్లడి

ప్రపంచ బాషలలో సంపూర్ణ శ్రీమద్భగవద్గీత ఆడియో ను రూపొందించడమే తన లక్ష్యమని డా. గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే 25 భాషల్లో రికార్డింగ్ పూర్తి అయ్యిందని వివరించారు. అంతేగాక శ్రీమద్భగవద్గీత యూట్యూబ్ , ఇతర మాధ్యమాల ద్వారా ఉచితంగా వినవచ్చునని, పల్లె పల్లె కు, గుండె గుండె కు , ఖండఖండాతరాలకు గీతను చేర్చాలన్నదే తన ఆశయమని శ్రీమద్భగవద్గీత తెలుగు ఆడియో లోకార్పణ సభలో డా.గజల్ శ్రీనివాస్ ప్రకటించారు. తన స్వస్థలమైన పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన గీత ఆవిష్కరణ సభలో...