SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 6:19 am Posted by : SHIVASURYA NEWS

ప్రపంచ బాషల్లో సంపూర్ణ శ్రీమద్భగవద్గీత ఆడియో రూపొందించి అందించడమే లక్ష్యం ప్రతీ పౌరునికి ఒక జీవన పాఠ్య గ్రంధం కావాలి లోకార్పణ సభలో డా.గజల్ శ్రీనివాస్ .వెల్లడి

ప్రపంచ బాషలలో సంపూర్ణ శ్రీమద్భగవద్గీత ఆడియో ను రూపొందించడమే తన లక్ష్యమని డా. గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే 25 భాషల్లో రికార్డింగ్ పూర్తి అయ్యిందని వివరించారు. అంతేగాక శ్రీమద్భగవద్గీత యూట్యూబ్ , ఇతర మాధ్యమాల ద్వారా ఉచితంగా వినవచ్చునని, పల్లె పల్లె కు, గుండె గుండె కు , ఖండఖండాతరాలకు గీతను చేర్చాలన్నదే తన ఆశయమని శ్రీమద్భగవద్గీత తెలుగు ఆడియో లోకార్పణ సభలో డా.గజల్ శ్రీనివాస్ ప్రకటించారు. తన స్వస్థలమైన పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన గీత ఆవిష్కరణ సభలో డాగజల్ శ్రీనివాస్ తండ్రి కేశిరాజు నరసింహారావు (93) చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ స్వరపరిచి, గానం చేసిన శ్రీమద్భగవద్గీత ఆవిష్కరణ జరిగింది. ఈ సభలో పూర్వ శాసన సభ్యులు డా. సి.హెచ్. సత్య నారాయణ మూర్తి, పూర్వ శాసన మండలి సభ్యులు శ్రీ అంగర రామ మోహన్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, కళారత్న రసరాజు, రోటరీ అంతర్జాతీయ డైరెక్టర్ డా. వడ్లమాని రవి , సేవ్ టెంపుల్స్ భారత్ సభ్యులు మేడికొండ శ్రీనివాస్, అడ్డాల వాసుదేవరావు, ముచ్చర్ల సత్య నారాయణ, విఠకుల రమణ, రెడ్డప్ప ధవీజీ , మాంటిస్సోరి వర్మ , తటవర్తి కృష్ణ మూర్తి , స్థానిక పెద్దలు , పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభలో పాల్గొని డా.గజల్ శ్రీనివాస్ గీతా గాన యాజ్ఞాన్ని అభినందించారు.