మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అమరావతిలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ 60 శాతం నిర్మాణ ఖర్చు బీసీసీఐదే ఏటా కనీసం 10 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు రాష్ట్రం నుంచి ఐపీఎల్ టీమ్ కు సన్నాహాలు

జయజయహే : రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతిలో స్టేడియం నిర్మించాలని ఏపీ మంత్రి నారా లోకేష్‌, బీసీసీఐ కార్యదర్శి జైషాను కలిసిన సమయంలో కోరారు. దీంతో.. ఈ విషయంలో బీసీసీఐ కూడా సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అమరావతిలో ఇంటర్నేషనల్‌ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60 శాతం బీసీసీఐ భరించనుంది. మిగతా మొత్తాన్ని ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున ఏపీ ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. మొత్తం వచ్చే ఏడాదికి లేదా...