కిడ్నీ బాధిత కుటుంబానికి ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్థికసాయం – అమ్మాయి చదువుకు సహకరించి అండగా నిలుస్తాం – మాదారపు డేవిడ్

శ్రీకాకుళం : జయజయహే : స్థానిక మంగువారితోటలో నివాసముంటున్న ఎస్.నాగరాజు, శ్యామల కుటుంబానికి శ్రీకాకుళం ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ అండగానిలిచింది. నాగరాజు అధిక టిబి, లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఇంటికే పరిమితమవ్వగా, అర్ధాంగి శ్యామలా రెండు కిడ్నీలు పాడవ్వటం బాధాకరమని, ప్రస్తుతం నగరంలో ఒక ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ పొందుతున్నారని, కనీసం మందులుకొనే స్థోమత కూడా లేదని ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ మాదారపు డేవిడ్ మంగళవారం అన్నారు. ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని,...