SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 6:40 am Posted by : SHIVASURYA NEWS

కిడ్నీ బాధిత కుటుంబానికి ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్థికసాయం – అమ్మాయి చదువుకు సహకరించి అండగా నిలుస్తాం – మాదారపు డేవిడ్

శ్రీకాకుళం : జయజయహే : స్థానిక మంగువారితోటలో నివాసముంటున్న ఎస్.నాగరాజు, శ్యామల కుటుంబానికి శ్రీకాకుళం ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ అండగానిలిచింది. నాగరాజు అధిక టిబి, లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఇంటికే పరిమితమవ్వగా, అర్ధాంగి శ్యామలా రెండు కిడ్నీలు పాడవ్వటం బాధాకరమని, ప్రస్తుతం నగరంలో ఒక ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ పొందుతున్నారని, కనీసం మందులుకొనే స్థోమత కూడా లేదని ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ మాదారపు డేవిడ్ మంగళవారం అన్నారు. ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఈ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 10 వేల రూపాయల ఆర్ధికసాయంతోపాటు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించామని, నాగరాజు కుమార్తెకు నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ పరిక్షా ఫలితాలలో 856 మార్కులు సాధించారని, ఆర్ధికంగా ఉన్నత చదువులు చదించలేని పరిస్థితి కాగా, ఆ విద్యార్థినికి ఉన్నత చదువుల నిమిత్తం మేము (డేవిడ్, ప్రదీప్, రాజశేఖర్, ప్రసాద్) అండగా నిలుస్తామని భరోసా కల్పించామన్నారు. ఈ కుటుంబం ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, స్వచ్ఛంద సంస్థలు గాని, మనసున్న దాతలుగాని వీరి కుటుంబానికి అండగా నిలవాలన్నారు. సహాయం చేయాలనుకునేవారు వారి చరవాణి ( 81062 93580 ) ద్వారా సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె.వర ప్రసాద్, (జూనియర్ అసిస్టెంట్ ) కె.లక్మమ్మ, కే.హేమలత, ఇతర సభ్యులతోపాటు, ఉర్లం. శివతేజ, బమ్మిడి.వేణు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.