గ్రేటర్ ఫైట్..! మేయర్ పై అవిశ్వాస కౌన్సిల్ నేడే వ్యూహ, ప్రతివ్యూహాలతో కూటమి, వైసీపీ
విశాఖపట్నం : జయజయహే : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశంకు రంగం సిద్ధం అయ్యింది. ఈనెల 19న మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అయితే అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు సాయంత్రం మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు విశాఖకు తరలివచ్చారు. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని విప్ జారీ చేసింది. మరోవైపు అవిశ్వాస తీర్మానంలో గెలుపొందాలని...