ముసుగేసి మీడియా ముందుకు పోలీసులతో గోరంట్ల వాగ్వాదం మాజీ ఎంపీతో పాటు మరో ఐదుగురు అరెస్టు ఖాకీల విధులకు ఆటంకం కలిగించినందుకు చర్యలు

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడుతూ, పోలీసులపై జులుం ప్రదర్శించి వారి విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల.మాధవ్ తో పాటు ఆయన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే నిందితుడిని అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్ వాహనాన్ని అనుసరించారు గోరంట్ల మాధవ్. కారు ఆపి మరీ పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై గోరంట్ల మాధవ్ దాడికి...