SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 10:44 am Posted by : SHIVASURYA NEWS

గ్లోబల్ లీడర్ కేంద్రమంత్రి కి పైల అభినందనలు

మాడుగుల: జయజయహే : వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఈ ఏడాదికి ఎంపికైన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు కి మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైల ప్రసాదరావు అభినందనలు తెలిపారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన దేశానికి, ముఖ్యంగా తెలుగు సమాజానికి గర్వకారణం అన్నారు. ప్రజా సేవ పట్ల మీ అంకితభావం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. మన రాష్ట్రం,దేశం పురోగతి కోసం మీరు కృషి చేస్తూ, ప్రపంచ వేదికపై భారతదేశం స్వరాన్ని ఉన్నతీకరిస్తూ మీరు నిరంతరం విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు .