మానవతా దృక్పథం ఉచిత వాటర్ కూలర్ ఏర్పాటు
ధవళేశ్వరం, జయ జయహే": ధవళేశ్వరం వివేకానంద ఐటిఐ చైర్మన్ బందుల. హనుమంతరావు మానవతా దృక్పథంతో చేపట్టిన మంచి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఎదురుగా, ముత్యమాల కన్వెన్షన్ హాల్ సమీపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ కూలర్‌ను ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ సి.ఐ టి.గణేష్ లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సి.ఐ గణేష్ మాట్లాడుతూ, ఎండలు ముదురుతున్న తరుణంలో ప్రజల కోసం చల్లటి నీటిని అందుబాటులో...