SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 5:49 am Posted by : SHIVASURYA NEWS

మానవతా దృక్పథం ఉచిత వాటర్ కూలర్ ఏర్పాటు

ధవళేశ్వరం, జయ జయహే”: ధవళేశ్వరం వివేకానంద ఐటిఐ చైర్మన్ బందుల. హనుమంతరావు మానవతా దృక్పథంతో చేపట్టిన మంచి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఎదురుగా, ముత్యమాల కన్వెన్షన్ హాల్ సమీపంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ కూలర్‌ను ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ సి.ఐ టి.గణేష్ లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సి.ఐ గణేష్ మాట్లాడుతూ, ఎండలు ముదురుతున్న తరుణంలో ప్రజల కోసం చల్లటి నీటిని అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. బందుల హనుమంతరావు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఇది అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వివేకానంద ఐటిఐ చైర్మన్ బందుల. హనుమంతరావు మాట్లాడుతూ, విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఈ వాటర్ కూలర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఐటిఐ కాలేజ్ ప్రిన్సిపాల్ సుబ్బరాజు, ఐటిఐ కళాశాల విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.