బర్త్ డే బొనాంజా నిరుద్యోగులకు చంద్రబాబు శుభవార్త మెగా డీఎస్సీ ప్రకటన
జయజయహే : కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూటమి సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే...