డిప్యూటీ మేయర్ గా హేమలత..? సామాజిక, రాజకీయ సమీకరణాల్లో ఛాన్స్ పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం
జయజయహే : గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో మేయర్ హరికుమారిపై అవిశ్వాసం పెట్టిన విజయం సాధించిన నేపథ్యంలో పాలక వర్గంపై కూటమి ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులుకు నేతలను ఎంపిక చేసే పనిని చేపడుతున్నట్లు తెలిసింది. ఇందుకు పలు సామాజిక, రాజకీయ సమీకరణాలతో బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. మేయర్ అభ్యర్థిగా ఏ సామాజిక వర్గానికి చెందిన నేత ఉంటే బాగుంటుంది.. రాజకీయంగా కలిసి వస్తుందనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. అలాగే డిప్యూటీ మేయర్లుగా ఎవరు ఉంటే కలసి...