డిగ్రీ కళాశాలల ప్రవేశాల విషయంలో ప్రభుత్వము నిర్ణయాలను వేగముగా తీసుకోవాలి – ఎ బి వి పి
జయజయహే : రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల ప్రవేశాల విషయంలో ప్రభుత్వము నిర్ణయాలను వేగముగా తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ కోరారు. డిగ్రీ స్థాయిలో ఒక మేజరా రెండు మేజర్ల ను ఉంచాలన్న విషయంపై ప్రభుత్వము ఒక కమిటీని వేసి, ఆ కమిటీ సమావేశము నిర్వహించి పది రోజులు కావస్తున్నా, ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించక పోవటాన్ని ఏబీవీపీ నిరసిస్తుందని ఆయన అన్నారు. మేజర్ల విధి విధానాలపై కమిటీ యొక్క నివేదికని వెంటనే బహిరంగ పరచాలని...