SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 11:09 am Posted by : SHIVASURYA NEWS

డిగ్రీ కళాశాలల ప్రవేశాల విషయంలో ప్రభుత్వము నిర్ణయాలను వేగముగా తీసుకోవాలి – ఎ బి వి పి

జయజయహే : రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల ప్రవేశాల విషయంలో ప్రభుత్వము నిర్ణయాలను వేగముగా తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ కోరారు. డిగ్రీ స్థాయిలో ఒక మేజరా రెండు మేజర్ల ను ఉంచాలన్న విషయంపై ప్రభుత్వము ఒక కమిటీని వేసి, ఆ కమిటీ సమావేశము నిర్వహించి పది రోజులు కావస్తున్నా, ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించక పోవటాన్ని ఏబీవీపీ నిరసిస్తుందని ఆయన అన్నారు. మేజర్ల విధి విధానాలపై కమిటీ యొక్క నివేదికని వెంటనే బహిరంగ పరచాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. అధికారులు సమన్వయ లోపం వల్ల ఇన్ని రోజులుగా కమిటీ నివేదిక రాలేదని విద్యార్థి లోకం భావిస్తుందని ఆయన ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే ఈ విషయాన్ని పరిశీలించి తగు నిర్ణయాన్ని వెంటనే తీసుకోని విద్యారంగంలో ఏర్పడిన గందరగోళాన్ని నివారించవలసిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అన్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్లతో ముడి పెట్టకుండా, డిగ్రీకళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, జూలై మొదటివారం కల్లా మొదటి డిగ్రీ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.