ఎక్కువ చేస్తే అదే చివర రోజు సోషల్ మీడియాలో స్వేఛ్చ దుర్వినియోగం వ్యక్తిత్వాన్ని కించపరిచే పోస్టులు చేస్తే చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్

గత ప్రభుత్వ హయాంలో ఎవరూ స్వేచ్ఛగా తిరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన స్వేచ్ఛను ఎవరూ దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. సోషల్ మీడియా నేరస్తులకు అడ్డాగా మారిందన్నారు. సోషల్ మీడియా ద్వారా ఎవరి వ్యక్తిత్వ హననం చేసినా వాళ్లకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. పిల్లలను మంచి పౌరులుగా తల్లిదండ్రులు...