వాడవాడలా పూజలు చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల హోరు రాష్ట్రమంతటా ఘనంగా సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు నక్కపల్లి హోం మంత్రి అనిత క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత 75 కిలోల కేక్ కట్ చేసి, సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం పుట్టినరోజు నేపథ్యంలో పేదలకు అన్నసమారాధన నిర్వహించి, స్వయంగా భోజనాలు వడ్డించారు మంత్రి అనిత. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ నాకు దైవ సమానులైన చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని...