అండగా నిలవండి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం రాజధానికి నిధులు ఇచ్చేలా సహకరించండి-ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి 16వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్
జయజయహే : రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం సచివాలయంలో ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. నేడు మీరు సాయం చేసి నిలబెడితే... రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని... స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘం...