బాణాసంచా పేలుడు 8 మంది దుర్మరణం భారీగా క్షతగాత్రులు.. కేజీహెచ్ లో చికిత్స పలువురు పరిస్థితి విషమం అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘటన బాబు, పవన్, లోకేశ్ ఆరా పరామర్శించి హోమ్ మంత్రి అనిత, సీఎం రమేశ్

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతోన్నారు. పోలీసులు క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ సందర్శించారు. క్షతగాత్రుల కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అలాగే సహాయక చర్యలను...