విశాఖపట్నం : జయజయహే: నగరానికి చెందిన జర్నలిస్ట్ యంఎస్ఆర్ ప్రసాద్ కు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారం అందజేసింది. విజయవాడ లో నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.వి.రమణ చేతులమీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. సామాజిక స్పృహతో కూడిన కథనాలు, ప్రజల్లో చైతన్యం పెంపొందించే వార్తలకు గాను అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు