Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ నడుస్తూ.. సమస్యలు వింటూ.. యోగక్షేమాలు తెలుసుకుంటూ..!...

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ నడుస్తూ.. సమస్యలు వింటూ.. యోగక్షేమాలు తెలుసుకుంటూ..! మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. ఆత్మీయ పలకరింపులతో పరవశించిన వేంపాడు గ్రామం.

అనకాపల్లి జిల్లా: జయజయహే: నక్కపల్లి మండలం వేంపాడులో హోం మంత్రి వంగలపూడి అనిత మార్నింగ్ వాక్ చేస్తూ గ్రామస్తులతో ముచ్చటించారు. ఆమె వెంట గ్రామస్తులు అడుగులో అడుగు కలిపారు. అనంతరం వేంపాడులో ఎన్టీఆర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసిన మంత్రి అనిత నివాళులు అర్పించారు. మార్నింగ్ వాకింగ్ చేస్తూనే ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే మంగళ హారతులతో హోం మంత్రికి పలువురు మహిళలు స్వాగతం పలికారు. ఉదయం వాకింగ్ చేస్తూ గ్రామస్తుల సమస్యలను హోంమంత్రి అడిగి తెలుసుకోవడంపై గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు. వేంపాడులో సీసీ రోడ్డు అవసరమని గుర్తించిన హోం మంత్రి రామాలయం వీధిలో వెంటనే సీసీ రోడ్డు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కొన్ని సమస్యలు నాదృష్టికి తీసుకువచ్చారని, త్రాగునీరు, డ్రైనేజీ,రోడ్లు ప్రధాన సమస్యలుగా గుర్తించామని,గ్రామాల్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నామని,15 రోజుల్లో త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.త్వరలో ఇంటింటికి కులాయి ఇవ్వబోతున్నామని మంత్రి అనిత చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?