SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 10:41 am Posted by : SHIVASURYA NEWS

అంబేద్కర్ వ్యక్తి కాదు ఒక శక్తి – టిడిపి అధ్యక్షులు గండి బాబ్జి

విశాఖపట్నం : జయజయహే : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి శాసనమండలి విప్ వేపాడ చిరంజీవిరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు. అయన ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని దేశంలో అన్ని వర్గాలకు చెందినవారు అని అన్నారు.అయన పేరు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందారని అన్నారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం నాయకులు వెల్లంకి భరత్, విశాఖ ఎస్సీ సెల్ అధ్యక్షులు బుడుమూరు గోవింద్, తోట రత్నం, వానపల్లి గాయత్రి ఫణి కుమారి, ఈతలపాక సుజాత, విల్లూరి చక్రవర్తి , వలిశెట్టి తాతాజి, కోట నరేష్, ఎర్నాగుల జగదీష్, దాసాన సత్యనారాయణ , అనసూరి మధు , బల్ల వరపు చిన్న , ఎన్ అప్పారావు , పొడుగు కుమార్ , గంట్యాడ ఆదినారాయణ, గణగళ్ళ సత్య ,బొడ్డేపల్లి లలిత, రాజు,కుట్టా కార్తీక్, నక్క కనకరాజు, సానపల కీర్తి, మేడపాటి సురేంద్ర, సారి పల్లి మహేష్, సతీష్ కుమార్, కొన్నూరు అప్పలనాయుడు, ఊరు కూటి గణేష్, కోనేటి సురేష్, మైలిపల్లి శ్రీనివాసరావు, శ్రీదేవి, జై శ్రీ, తదితరులు పాల్గొన్నారు