చోడవరం : జయజయహే : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని చోడవరం కొత్తూరు జుంక్షన్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు . సిఐటియు జిల్లా కోశాధికారి వి వి శ్రీనివాసరావు, కార్యదర్శలు ప్రేమ్ చంద్రశేఖర్, గూనూరు వరలక్మి లు మాట్లాడుతూ నేడు రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడిందని, బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తి కె భిన్నంగా దేశాన్ని పాలిస్తున్న తరుణంలో దీన్ని ఎర్ర జండా మాత్రమే ఎదుర్కొంటోన్నదన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, ఆదివాసీలు, మహిళల మీద దాడులు అమానుషంగా పెరుగుతున్నాయన్నారు. రాజ్యాంగం పరిరక్షణ కోసం కులాలకు, మతాలకతీతంగా అందరం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు గోవింద్, ఆశ యూనియన్ నాయకులు కె. వరలక్మి, లక్మి, నాగిరెడ్డి సత్యనారాయణ, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
అంబ్కేదర్కు సీఐటీయూ ఘన నివాళి
0
56
RELATED ARTICLES

