SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 6:25 am Posted by : SHIVASURYA NEWS

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి జిల్లా ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ డా.బి.ఆర్ అంబేద్కర్అందరికీ ఆరాధ్యదైవం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి

పాడేరు జయ జయహే : అందరికీ ఆరాధ్యదైవం డా ,, బి ఆర్ అంబేద్కర్ అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి అన్నారు,సోమవారం పాడేరు జిల్లా కేంద్రంలో డా,, బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల జిల్లా త్రీ మాన్ కమిటీ ఇంచార్జీ రవికుమార్ పెనుమాక ఆధ్వర్యంలో 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి పాడేరు అంబేద్కర్ సెంటర్ లో జ్యోతి ప్రజ్వలన చేసి డా. బి. అర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు అందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ డా,,బి ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఉండి ఆయన అనేక మంది తో కలసి రాజ్యం పొందు పరిచారు అని ఆమె అన్నారు, భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆయన కు భారత రత్న ఇచ్చి ఆయన విగ్రహాన్ని దేశ రాజధాని పార్లమెంట్ లో పెట్టింది బీజేపీ ప్రభుత్వం లోనే అని తెలిపారు.