SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 11:33 am Posted by : SHIVASURYA NEWS

ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అరుగుజాడల్లో నడవాలి– డాక్టర్ కందుల నాగరాజు

విశాఖపట్నం : జయజయహే : సమాజంలోని అంటరానితన్నాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సూచించారు.ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్ఐసి జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అలాగే భీమ్ నగర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూస్వేచ్ఛ సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహనీయుడు అంబేద్కర్ కొనియాడారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు బలహీనవర్గాల ప్రజలకు అందినప్పుడే ఆయనకిచ్చే నిజమైన నివాళులని అన్నారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం యువత అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సంస్కరణలకు ఆద్యుడని కొనియాడారు. అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నూకరాజు ,రమణ , సత్యనారాయణ ,గండేటి కృష్ణ , గండేటి జనార్దన్ , వెంకటేష్ , సరళ ప్రసాద్ , పినిపిల్లి కనకరాజు ,కంచుమూర్తి ఈశ్వరావు , పినిపిల్లి రాజు , పినిపిల్లి కనకరాజు , ఐనడా త్రినాద్ , రాంబాబు , రామకృష్ణ , కుమారి ,బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.