SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 11:24 am Posted by : SHIVASURYA NEWS

భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా”బి. ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం …. అనకాపల్లి పట్టణంలోని 83వ డివిజన్ పరిధిలో గల ఎ ఎమ్ సి కాలనీలొ డా”బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ….. అనకాపల్లి …ఎ ఎమ్ సి కాలనిలో పేదలకు చీరల పంపిణి…. డా”బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించిన – టీడీపీ యువ నాయకులు డా”పీలా శ్రీకాంత్

అనకాపల్లి : జయజయహే : భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా”బి ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు అనకాపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా అనకాపల్లి పట్టణంలోని 83వ డివిజన్ పరిధిలో గల ఎమ్ సి కాలనీలో జరిగిన ఉత్సవాలలో ముఖ్యఅతిధులుగా రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తనయుడు, టీడీపీ యువనాయకులు డా పీలా శ్రీకాంత్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ సందర్బంగా ఎమ్ సి కాలనిలో ఎస్. భానుచందర్ (అఖి) ఆధ్వర్యంలో పేదలకు 83వ వార్డు ఇంచార్జీ బొద్దపు ప్రసాద్ పార్టీ శ్రేణిలతో కలిసి చీరలను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జిల్లా టి.ఎన్.టి.సి ఉపాధ్యక్షులు పిట్లా రాజు, జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి దాడి జగన్, అనకాపల్లి టౌన్ టి.ఎన్.టి.సి అధ్యక్షులు ఆకులు నానాజీ, పల్ల సత్య అప్పారావు, పైలా గోపి, గొల్లవెల్లి నూకరాజు (ఎనర్జీ కమాండో), తిప్పాన అప్పారావు, సందిన చిన్నబాబు, పనింద్ర, షేక్ రియాజ్, పిట్ల హరీష్, నంద్యాల గణేష్, బొమ్మల దేవి, సింగంపల్లి నీలకంఠరావు, బొగ్గు శ్రీను, నూకరాజు, కమిటీ సభ్యులు చెక్కల నూకరాజు, మిడిపాటి సాయి జగన్, రాజు, ప్రసాద్, మరియు అధిక సంఖ్యలో మహిళలు పుర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.