అమరావతిలో ఎయిర్ పోర్ట్ గుంటూరు – విజయవాడను కలిపి మెగా సిటీ చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి రాజధాని పనుల పరిశీలన

జయజయహే: అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను, మంత్రి నారాయణ, సీఆర్డీయే, మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయన్నారు. రాజధానిలోని అనంతవరంలో మంత్రి నారాయణ పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టింది. 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851...