వైద్య విద్యార్థి ప్రణీత ఆత్మహత్యకు కారణమైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఏబీవీపీ
జయజయహే : శనివారం మధ్యాహ్నం తగరపువలసలో ఉన్నటువంటి ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజ్ కు చెందిన దత్త ప్రణీత్ కళాశాల నాలుగవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధులు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఉమ్మిడి నితిన్ మాట్లాడుతూ వైద్య విద్యార్థి ప్రణీత్ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు...