Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీవైద్య విద్యార్థి ప్రణీత ఆత్మహత్యకు కారణమైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి...

వైద్య విద్యార్థి ప్రణీత ఆత్మహత్యకు కారణమైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఏబీవీపీ

జయజయహే : శనివారం మధ్యాహ్నం తగరపువలసలో ఉన్నటువంటి ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజ్ కు చెందిన దత్త ప్రణీత్ కళాశాల నాలుగవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దర్యాప్తు వేగవంతం చేసి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధులు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఉమ్మిడి నితిన్ మాట్లాడుతూ వైద్య విద్యార్థి ప్రణీత్ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని గతంలో కూడా ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అదే కాకుండా మహిళ విద్యార్థులపై లైంగిక దాడులు వంటి ఘటనలు వెలుగు చూసిన తరువాత కూడా కళాశాల యజమాన్య తీరులో ఎటువంటి మార్పు రాలేదని వాపోయారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రసాద్, జోనల్ ఇన్చార్జులు ధనుష్ మరియు విష్ణు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?