ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeతాజా సమాచారంకౌతాళం వద్ద ఎల్ఎల్సి కాల్వలో కారు బోల్తా..నలుగురు సురక్షితం.....ఇద్దరు గల్లంతు...

కౌతాళం వద్ద ఎల్ఎల్సి కాల్వలో కారు బోల్తా..నలుగురు సురక్షితం…..ఇద్దరు గల్లంతు…

📰 Generate e-Paper Clip

ఆదోని -కౌతాళం రహదారిలో లక్ష్మమ్మ నగర్ సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర దిగువ కాలువలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన హుబ్బల్లి కాపురస్తుల కారు అదుపుతప్పి  బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురిని అక్కడే ఉన్నవారు వెంటనే స్పందించి కాపాడగలిగారు. అయితే మరో ఇద్దరు ఆచూకీ దొరకాల్సి ఉంది. వారు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి ఉంటారని అక్కడ ఉన్న వారు పేర్కొంటున్నారు. కౌతాళం పోలీసులు , కౌతాళం సింగల్ విండో అధ్యక్షులు వెంకటపతి రాజు సహాయక చర్యలు చేపడుతున్నారు.. గల్లంతయిన వారికోసం వలలు వేసి వెతుకుతున్నారు. కాల్వలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఆచూకీ దొరకడం లేదని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!