Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీలిక్కర్ కేసులో సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. విచారణకు కోర్టు అనుమతి..!

లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. విచారణకు కోర్టు అనుమతి..!

: తాజాగా లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 – కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు, ఏ31 – ధనుంజయ రెడ్డి, ఏ32 – కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 – గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు, ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టనున్నారు.

ఎసిబి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు (ఈరోజు, రేపు) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఈ విచారణ సిట్ కార్యాలయంలోనే జరుగుతుంది. ఈ రోజు ఉదయం విజయవాడ జైలు వద్ద నిందితులను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు, వైద్య పరీక్షల అనంతరం నేరుగా కస్టడీ విచారణకు తరలించారు. లిక్కర్ కేసులో నిందితులపై ఇప్పటికే పలు మలుపులు తిరిగిన నేపథ్యంలో, ఈ కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?