విశాఖపట్నం , జయజయహే : జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి వి వి నాగరాజు, జనరల్ సెక్రెటరీ ఎం సంజీవరెడ్డి , అసోసియేషన్ సభ్యులు శుక్రవారం మేయర్ ఛాంబర్ లో విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి విశాఖ నగర మేయర్ పదవిని అధిరోహించినందుకు గానూ అభినందనలను తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ సత్కార సభలో మేయర్ మాట్లాడుతూ జీవీఎంసీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను దక్కించుకున్న జీవీఎంసీ కాంట్రాక్టర్లు పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి విశాఖ నగర అభివృద్ధికి సహకరించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఇప్పటికే పనులను పూర్తి చేసి, మిగిలిన పనులను ప్రారంభించేందుకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంట్రాక్టర్లు మేయర్ ని కోరగా, మేయర్ స్పందిస్తూ సంబంధిత కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల విడుదలపై కలెక్టర్ తో చర్చించి బిల్లును అందించే ఏర్పాటు చేస్తానని , పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాల్సిందిగా జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులకు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
నగర మేయర్ ను సత్కరించిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్
0
32
Previous article
RELATED ARTICLES

