ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసమ్మె జయప్రదం చేయండి - కలాసీలకు సిఐటియు పిలుపు

సమ్మె జయప్రదం చేయండి – కలాసీలకు సిఐటియు పిలుపు

📰 Generate e-Paper Clip

చోడవరం : జయజయహే : కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసే లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ ఈనెల 20న నిర్వహించ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. కనీస వేతనాలు, ముటా, ఆటో కార్మికుల కు సమగ్ర చట్టం,వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు తదితర డిమాండ్లతో మే 20వ తేదీ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి వి వి శ్రీనివాసరావు, ఎస్. వి నాయుడు లు పిలుపునిచ్చారు. గురువారం చోడవరం లో కళాసీలతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ వల్ల సమ్మె చేసే హక్కు , సంఘం పెట్టుకునే హక్కు, పనిగంటలు పెంచడం, పారిశ్రామిక వివాదాలు చట్టానికి తూట్లు పోడవటం వంటి అనేక దుర్మార్గమైన విధానాలు ఈ లేబర్ కోడ్స్ లో పొందుపరిచారన్నారు. అసంఘటిత రంగ కార్మికులైన ముఠా, బిల్డింగ్, ఆటో, మోటార్ ట్రాన్స్ పోర్ట్ రంగాల కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం వంటివి కోల్పోతారన్నారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకుండా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ చంద్ర శేఖర్, వెంకటరావు, శ్రీను, నాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!