Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీకస్టడీకి శ్రీధర్ రెడ్డి

కస్టడీకి శ్రీధర్ రెడ్డి

జయజయహే : లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని న్యాయస్థానం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో రేపు అంటే, ఈనెల 15, 16, 17 తేదీల్లో సిట్ అధికారులు సజ్జలను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మద్యం స్కాం లో‌ కీలకంగా పని‌చేసిన సజ్జల శ్రీధర్ రెడ్టి ద్వారా మరింత సమాచారం రాబట్టాలని భావిస్తున్న సిట్ అధికారులు ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కస్టడీ అనుమతి పొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6)ని కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఏసీబీ కోర్టులో మే 12 సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీధర్‌రెడ్డి నుంచి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీంతో ఇవాళ కస్టడీకి ఇచ్చింది కోర్టు. మరోవైపు, మద్యం కుంభకోణం కేసులో జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) దిలీప్‌ ఏసీబీ కోర్టులో సోమవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో దిలీప్‌ ఏ-30గా ఉన్నారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం కేసును ఈ నెల 15కి వాయిదా వేసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?