ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీదాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు .. మార్నింగ్ కాఫీ క్లబ్

దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు .. మార్నింగ్ కాఫీ క్లబ్

📰 Generate e-Paper Clip

భీమవరం : జయజయహే : ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాస్ అన్నారు. భీమవరం డిఎన్నార్ కళాశాల వద్ద డిఎన్నార్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్నింగ్ కాఫీ క్లబ్ సహకారంతో మంగళవారం చలివేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఏడాది డిఎన్నార్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న చలివేంద్రానికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ సహకారం అందిస్తుందని, దాతల సహకారం కూడా ఎంతో అవసరమని వారు అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పాకలపాటి సీతారామరాజు, జాలివాకర్, జి. అప్పలరాజు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!