ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపి.జి.ఆర్.ఎస్. అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

పి.జి.ఆర్.ఎస్. అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఇంచార్జి జిల్లా కలెక్టరు ఎమ్. జాహ్నవి

అనకాపల్లి, జయజయహే : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమంలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని, అర్జీలపై సకాలంలో చర్యలు తీసుకోవాలని ఇంచార్జి జిల్లా కలెక్టరు మరియు జాయింటు కలెక్టరు ఎమ్. జాహ్నవి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టరు మరియు జాయింటు కలెక్టరు ఎమ్. జాహ్నవి, జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, హౌసింగు పి.డి. వై.శ్రీనివాసరావు, ఎస్.డి.సి. ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో ప్రజల నుండి తీసుకున్న అర్జీల పరిష్కారం గూర్చి సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసారు. పి.జి.ఆర్.ఎస్. పెండింగు అర్జీలపై సమీక్ష నిర్వహిస్తూ పెండింగు అర్జీలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. అర్జీలు పెండింగు లేకుండా సకాలంలో పరిష్కరించాలని, అర్జీలో తెలిపిన సమస్యకు సంబంధించి వివరణ స్పష్టంగా తెలపాలని, అర్జీదారునికి సమస్య పరిష్కారం గూర్చి అర్దమయ్యేవిధంగా తెలియజేయాలని ఇంచార్జి జిల్లా కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

                                 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!